Telugu Desam Party: ఏపీ డీజీపీకి వర్ల రామయ్య లేఖ.. ఏం రాశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్ఐపై మట్టి మాఫియా ఎదురు కేసు పెట్టడంపై లేఖలో వర్ల రామయ్య అభ్యంతరం తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు పెట్టారంటే మట్టి మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం దుర్మార్గ చర్య అని ఆయన మండిపడ్డారు.
బాధితుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం అంటే ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లేట్లు చేయడమేనని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య తెలిపారు. పోలీసుల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసు వ్యవస్థను నాశనం చేసేలా క్రిమినల్స్‌ను కాపాడుతున్నారని వర్ల రామయ్య విమర్శలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల సంఘం, గనుల శాఖ అదికారులు దీనిపై మౌనం వహించడంపై కారణాలు వారికే తెలియాలన్నారు. కాగా గుడివాడ మట్టి మాఫియా ఘటనలో బుధవారం నాడు ఆర్ఐ అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!