ఏపీలో పోలీసులు, సీఐడీ అధికారుల తీరుపై మండిపడ్డారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆమె మాట్లాడారు. సిఐడి ఛీఫ్ సునీల్ సిఎంకు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారన్నారు. ఏకేసు పెట్టక పోయినా సిఐడి కావాలని కేసులు పెడుతుంది. నేను అంబేద్కర్ వాదినని చెప్పి ఆయనకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి రాజారెడ్డి రాజ్యాంగానికి కొమ్ముకాస్తున్నాడు. సాటి దళితుడు డాక్టర్ సుధాకర్ పై పిచ్చోడనే ముద్రవేసి చనిపోయేలా చేశారు. అంబేద్కర్ వారసుడు అని చెప్పుకునే అర్హత సిఐడి ఛీఫ్ సునీల్ కుమార్ కు లేదని మండిపడ్డారు.
వరప్రసాద్ కి గుండుకొట్టించిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. జగన్ కోడి కత్తి నాటకమాడి సియం అయ్యాడు.. దళితుడైన కోడి కత్తి సీను నాలుగు సంవత్సరాలుగా జైలులో మగ్గి పోతున్నాడు..కత్తి శీను తల్లిదండ్రులు సిఎం కు కలిసేందుకు వెళితే వెనక్కు పంపారు. ఇప్పటికి అతనికి న్యాయం చేయలేదు.. దళితులను అడ్డంపెట్టుకుని రాజ్యాధికారం చేపట్టిన జగన్ కుటుంబం వారినే తుంగలో తొక్కుతుంది.. దళితుడైన సిఐడి ఛీఫ్ ను అడ్డం పెట్టుకుని సియం జగన్ నాటకాలాడుతున్నాడన్నారు. వీటన్నింటిపై సిఐడి ఛీఫ్ ఎందుకు స్పందించడంలేదు?
Read Also: Harish Rao: బీజేపీ నాయకులు గల్లీ నేతలకంటే దిగజారి మాట్లాడుతున్నారు
ఎస్సీ సబ్ ప్లాన్ ని నిర్వీర్యం చేసిన సియం దగ్గర సునీల్ కు ఎలా పనిచేయాలనిపిస్తుంది? నేను ఒక దళితురాలిగా అడుగుతున్నా .. నీకు చిత్తశుద్ది ఉంటే జగన్ నామస్మరణ ఆపాలి. పులివెందులలోని నాగమ్మ అనే మహిళ విషయంలో మాపై అట్రాసిటీ కేసులు పెట్టారు..మళ్ళీ సెక్షన్లు మార్చి కేసులు పెట్టారు. కుటుంబ నేపథ్యాలు మేము కూడా మాట్లాడగలం. సునీల్ వ్యవహారశైలి వల్ల చాలా మంది పోలీసులు వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకుంటున్నారు. వచ్చేది మా ప్రభుత్వం ఎవరినీ వదలం .. అందరి చిట్టా మాదగ్గర ఉందన్నారు. సీఐడీ ఇంటరాగేషన్ పేరుతో నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బయట వ్యక్తులు ఎవరు మాకు తెలుసు.. సిఎంకు ఎలా వీడియోలు చూపించారో తెలుసు.. ఇది బెదిరింపు కాదు రాజ్యాంగపరంగా అధికారం లోకి రాగానే చర్యలు తీసుకుంటాం. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని కోరుతున్నా అన్నారు వంగలపూడి అనిత.
Read Also: YSRCP Kapu Leaders Meeting: రాజమండ్రిలో కాపు ప్రజాప్రతినిధుల భేటీ ప్రారంభం