తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. 2024 ఎన్నికలు అయిపోతే టీడీపీ నాయకులు ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరలేపారు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ సీఎం చంద్రబాబు.. టీడీపీ నాయకులను రోడ్డుపై పారేశారని కామెంట్ చేశారు.. ఇక, ఉన్న డబ్బులు అంతా రాజకీయలకే ఖర్చు చేశాను, 2024 ఎన్నికలు వస్తే నా ఆస్థి అంత కరిగిపోయి నేను టీ వ్యాపారం పెట్టుకొని బతకాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ ఆస్తులు అమ్ముకున్నారని.. 2024 ఎన్నికలకు వెళ్తే అందరూ అప్పులు చేసి దివాలా తీసి రోడ్డున పడాలి లేకపోతే సూసైడ్ చేసుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు.
Read Also: Jaggareddy: సంచలన నిర్ణయానికి టైం ఉంది.. అది కూడా పార్టీ మంచి కోసమే..
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… 2024 ఎలెక్షన్ అయిపోతే టీడీపీ నాయకులు ఆస్తులు అమ్ముకొని సూసైడ్ చేసుకుంటారు అని వ్యాఖ్యానించారు తిక్కారెడ్డి… మరోవైపు, నా మీద గెలిచిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దేవుని గదిలో దేవుళ్ల ఫొటోలు తీసి సీఎం జగన్ ఫొటోలు పెట్టుకున్నాడు… అక్రమ ఇసుక అమ్మి బస్తాలు, బస్తాలు డబ్బులు సంపాదిస్తున్నాడు అని ఆరోపించారు. రోజుకు 400 ట్రిప్పులు ఇసుక తరలిస్తే 50 ట్రిప్పులకు బిల్లులు వేయించి 350 ట్రిప్పుల ఇసుక డబ్బులు ఎమ్మెల్యే ఖాతాలో జమ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇసుక లారీల తరలింపుతో రోడ్లు పగిలి అద్వనంగా తయారయ్యాయని విమర్శించారు.. ధర్నాలకు, సర్పంచ్, ఎమ్మెల్యే ఎన్నికలకు వైసీపీ అధిష్టానం మూటలు, మూటలు డబ్బులు ఇస్తోందని చెప్పుకొచ్చారు టీడీపీ నేత తిక్కారెడ్డి.