Site icon NTV Telugu

Somireddy Chandramohan Reddy: పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువైంది

Somireddy1

Somireddy1

నెల్లూరు జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయంగా రంజుగా వుంటుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. దళితుడు ఉదయగిరి నారాయణ మృతిపై టీడీపీ పోరాటం ఫలించింది. నెల్లూరు జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువయింది. జిల్లా ఎస్పీ కూడా అధికార పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. పోలీసులు కొట్టి చంపారని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చినా దాన్నితారుమారు చేశారు.

ఈ విషయాన్ని వైద్యులే నాకు చెప్పారు. నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు సోమిరెడ్డి. రూ. 5 లక్షలు అకౌంట్ లో వేసి కేసు మాఫీ కోసం ప్రభుత్వం ఆటలు ఆడింది. 5వేలు పింఛన్..4వతరగతి ఉద్యోగం,18 అంకణాలు స్థలం, 3ఎకరాలు పొలం ఇస్తా అని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి ప్రోద్బలంతోనే అధికారులను 4 నెలలకే బదిలీలు చేస్తున్నారు. ముత్తుకూరు ఎస్.ఐ బహిరంగంగా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం.అధికారుల తీరుపై జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐలతో కలిసి పోరాటం చేస్తాం అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

ఇదిలా వుంటే.. ఉదయగిరి నారాయణ మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్‌ విచారణ చేపట్టింది. పొదలకూరు ఎస్సై కరిముల్లా కొట్టడంతోనే జూన్‌ 19న నారాయణ చనిపోయాడని, తమకు న్యాయం చేయాలని నారాయణ భార్య పద్మ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ఎస్సీ కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సునీల్‌కుమార్‌బాబు శనివారం జిల్లాలో విచారణ చేపట్టారు. తొలుత మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని పరిశీలించి తర్వాత కందమూరు వెళ్లారు. మృతుడి భార్య పద్మతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో పెద్ద కుమారుడు సైతం తన తండ్రిని పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని తెలిపాడు. ఈ వ్యవహారం పెను సంచలనం కలిగించనుంది.

Tiger Fear: బాబోయ్ పులి.. కంటిమీద కునుకులేని జనం

Exit mobile version