Site icon NTV Telugu

TDP: వాస్తవ పరిస్థితులే కేటీఆర్ చెప్పారు.. జగన్‌ అసమర్థతే కారణం..!

Prathipati Pulla Rao

Prathipati Pulla Rao

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాకపుట్టిస్తున్నాయి.. వైసీపీ నేతలు కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తే.. టీడీపీ నేతలు మాత్రం నిజమే అంటున్నారు.. ఇక, కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులు కేటీఆర్ చెప్పారన్నారు.. అయితే, ఏపీ విధ్వంసం, తెలంగాణ అభివృద్ధి వైఎస్‌ జగన్ -కేసీఆర్‌ల ఉమ్మడి అజెండాగా ఆరోపించారు. ఒకప్పుడు ఏపీలో ఉన్న భూముల ధరలు 200 శాతం పడిపోతే, తెలంగాణలో గణనీయంగా పెరిగాయని, క్షీణించిన శాంతి భద్రతలు, జరగని అభివృద్ధి, పరిశ్రమలు మూతపడటంతో తెలంగాణ సురక్షితమని అంతా భావిస్తున్నారని తెలిపారు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ గొప్ప చాటేందుకు ఏపీతోనే పోల్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. దీనికంతటికీ వైఎస్‌ జగన్ అసమర్థతే కారణం అని విమర్శించారు పత్తిపాటి పుల్లారావు.

Read Also: Botsa Satyanarayana: కేటీఆర్ తన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవాలి..

Exit mobile version