Site icon NTV Telugu

Pattabhi: మద్రాస్ ఐఐటీ నివేదికనే ఫోర్జరీ చేసిన చరిత్ర వైసీపీది..!!

Pattabhi

Pattabhi

Pattabhi: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వీడియోపై ఇటీవల టీడీపీ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్వయంగా ప్రకటించడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఎడిటింగ్ లేదని జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. ఈ అంశంలో త్వరలోనే మరిన్ని నిజాలతో బయటకు వస్తామన్నారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక తప్పు అని చెప్పడం సరికాదన్నారు. స్టాఫోర్డ్ కు తాము పంపిన ఈమెయిల్స్, ఇతర ఆధారాలు అన్నీ ఉన్నాయని పట్టాభి వెల్లడించారు.

Read Also: Perni Nani: అశ్లీల చిత్రాలను సృష్టించేది ఆయనే.. ప్రచారం చేసేది ఆయనే..!!

మహిళలకు రక్షణ కల్పించే విషయంలో సీఐడీ చూపించని చొరవ తప్పు చేసిన వారిని వెనకేసుకు రావటంలో చూపుతుండడం దురదృష్టకరమని పట్టాభి వ్యాఖ్యానించారు. మద్రాస్ ఐఐటీ నివేదికనే ఫోర్జరీ చేసిన చరిత్ర వైసీపీది అని.. తాము అలాంటి పనులు చేయం అని పట్టాభి ఎద్దేవా చేశారు. నిజం నిప్పులాంటిదని, ఎవరూ కప్పిపుచ్చలేరని ఉద్ఘాటించారు. డర్టీ పిక్చర్ ఎంపీని వైసీపీ నేతలు వెనుకేసుకురావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అన్ని రకాల పరిశోధనలతో కూడిన ఫోరెన్సిక్ నివేదిక తెస్తే.. తమపైనే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికైనా మాధవ్ న్యూడ్ వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని పట్టాభి డిమాండ్ చేశారు.

Exit mobile version