Chintakayala Vijay: ఆ వీడియోకు.. నాకూ ఏం సంబంధం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోకు.. నాకు ఏం సంబంధం..? టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాకు.. నీ పర్సనల్ వీడియోతో ఏం సంబంధం? అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. ఎంపీగా ఉన్న మాధవ్ పార్లమెంటుకు.. ఓటేసిన ప్రజలకు.. కుటుంబానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మాధవ్.. ఆ వీడియో ఫోరెన్సిక్ ఇవ్వు.. వాస్తవాలెంటో తెలుస్తాయి. మాధవ్..! నీ సుందర ప్రతిబింబం చూడాల్సిన అవసరం నాకేం ఉంటుంది. నీ సుందర ప్రతిబింబాన్ని చూడడానికి ఎవరికి గుండెలు సరిపోవు. జిమ్‌లో ఏదో చేశానంటూ వీడియో చూపించారు.. మేం బతికి ఉంది ఇందుకేనా..? మాధవ్ వీడియో చూసిన ప్రజలు ఏమైపోయారోనని ఆందోళనగా ఉంది.
ఇలాంటి వీడియోలను ఎవరైనా మార్ఫ్ చేస్తారా..? మాధవ్ మీద నేను పరువు నష్టం దావా వేస్తా. మాధవ్ మీద పార్లమెంట్ సెక్రటేరీయేట్లో ఫిర్యాదు చేస్తా. ఏపీ సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడ్డానికి మాధవ్‌ను ఎంపీ చేస్తే.. సిగ్గు లేకుండా బట్టలిప్పి వీడియోలు వదులుతారా..? నీ వీడియో మార్ఫ్ చేయడానికి నువ్వేమన్నా టామ్ క్రూజ్‌వా..? జిమ్ చేస్తోంటే వీడియోలు తీయడానికి నువ్వేమైనా హాలీవుడ్ యాక్టరువా..?
Also Read
MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..
మేం బతికుంది నీ నగ్న వీడియోలు చూడడానికా..?ఉదయాన్నే వాట్సాప్‌లో మాకేంటీ రచ్చ.సీఎం జగన్ ఎంపీ మాధవ్‌ను సస్పెండ్ చేయాలి.మీసం తిప్పావని.. తొడగొట్టావని జగన్ టిక్కెట్ ఇచ్చారు.. నువ్వు ఎంపీ అయ్యావు.లైవుల్లో కూర్చొని ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి కానీ.. ఈ వీడియోలేంటీ..? ఈ రోజు వరకు మాధవ్ ఎవడో ఏంటో తెలీదు. మాధవ్ మీద కేసులున్నాయని నేషనల్ మీడియాలో స్పష్టంగా చెప్పారు.మాధవ్ బేషరతుగా రాజీనామా చేయాలి.ఈ వీడియో తనది కాదని ప్రూవ్ అయితేనే మళ్లీ రాజకీయాల్లోకి రావాలి. ఆ వీడియోను ఇంకొంత సేపు చూస్తే.. నాకు ఆరోగ్య సమస్యలు వచ్చేలా ఉంది. వైసీపీ రాసలీలల పార్టీగా మారింది.
నువ్వేం తోపు కాదు.. నిన్ను చూస్తేనే ఏపీ ప్రజలకు కంపరం పుడుతోంది.మాధవ్..! నీ వీడియో మార్ఫింగ్ చేయడానికి టెక్నాలజీ మీద పెట్టే డబ్బు కూడా దండగ.. ఆ విషయం తెలుసుకో.25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తానన్నారు.. ఇలా లైవులో చూపించడమేనా ప్రత్యేక హోదా.మాధవ్.. నీ చరిత్ర అందరికీ తెలుసు.కియో కంపెనీ ప్రతినిధులపై విరుచుకుపడిన చరిత్ర నీది.మొన్న మా తండ్రి అయ్యన్నను టార్గెట్ చేశారు.. ఇప్పుడు నా మీద విమర్శలు చేస్తారా..?
తాజావార్తలు
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
-
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?