NTV Telugu Site icon

Ayyanna patrudu Arrest: అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై ఆరోపణలు వచ్చాయి. తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, నోటీసులు ఇచ్చి టీడీపీ నేతను అరెస్ట్ చేశారు. అయ్యన్న కుమారుడు రాజేష్‌ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్ కు ముందు హై డ్రామా చోటుచేసుకుంది. అంతకుముందు నర్సీపట్నంలోని ఆయన ఇంటిని సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

 

Read Also: Naga Chaitanya – Samantha : సమంతను కలిసిన నాగచైతన్య.. నేనున్నానంటూ భరోసా

ఇటీవల అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు. ఏలూరు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. అయ్యన్న అరెస్టుకు నిరసనగా నర్సీపట్నంలో ర్యాలీ నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. నర్సీపట్నం శ్రీకన్య సెంటర్ నుంచి ఆసుపత్రి సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు.అయ్యన్న అరెస్టు అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగర ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ లు ఏర్పాటు చేశారు.

Read ALso: Munugode Bypoll Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లైవ్ అప్ డేట్స్