సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… ఉగాది కానుకగా పేద, మధ్య తరగతిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని.. ఇది పెను భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏడు సార్లు పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్న ఆయన.. ఎమ్మెల్యేలు గానీ, మీరు గానీ ప్రజల్లోకి వెళ్తే జనం బాదుడే… బాదుడు… అని హెచ్చరించారు.. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తరిమి కొట్టకపోతే రాష్ట్రానికి, మన పిల్లలకు భవిష్యత్ ఉండదంటూ పిలుపునిచ్చారు అయ్యన్నపాత్రుడు.
Read Also: IPL 2022: మా ఓటమికి ఆ ఒక్క తప్పిదమే కారణం: శ్రేయాస్ అయ్యర్
ఇక, విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పేదవారిపై రూ. 1,400 కోట్ల భారం పడనుంది అన్నారు అయ్యన్నపాత్రుడు… భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కవ పెట్రోల్ ధరలున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్న ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపు నుంచి చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసిన ఘనుడు జగన్ రెడ్డి… ఇవన్నీ జగన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలే అంటూ మండిపడ్డారు. కాగా, విద్యుత్ ఛార్జీల పెంచుతూ ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. స్లాబులుగా విభజించి.. విద్యుత్ చార్జీలను పెంచబోతున్నారు. దీనిపై ఏపీలో విపక్షాలు అన్నీ ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం విద్యుత్ ఛార్జీలపై దశలవారీ పోరాటం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.