NTV Telugu Site icon

TDP Formation Day: నేడు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Tdp

Tdp

TDP Formation Day: నేడు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం, టీడీపీ జెండాను ఎగురవేసి.. ఆ తర్వాత మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

Read Also: CSK vs RCB: 6155 రోజుల తర్వాత చెపాక్‌లో ఆర్సీబీ విజయం..

అయితే, తెలుగు దేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన దివంగత ఎన్టీ రామారావు స్థాపించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు పేదలు, రైతులు, మధ్య తరగతి వర్గాలకు అండగా నిలవడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. ఇక, తన 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది.. అలాగే, రాష్ట్రంలో అత్యంత విజయవంతమైన పొలిటికల్ పార్టీగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో పాలన కొనసాగిస్తుంది ఈ పార్టీ.