Site icon NTV Telugu

ఏపీ మంత్రిపై అవినీతి ఆరోపణలు.. రూ.100 కోట్ల దోపిడీ..!?

Anil Kumar Yadav

Anil Kumar Yadav

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు… నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దందా దుమారం రేపుతోంది… ఈ వ్యవహారంలో మంత్రి అనిల్‌ కుమార్‌పై ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు.. పెన్నా ఇసుక రీచ్ నుంచి రూ.100 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు.. అయితే, తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు చేశారు.. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశానికి హాజరు అయ్యారు.. అయితే, క్యాంపు కార్యాలయంలో కాకుండా పెన్నా ఇసుక రీచ్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది టీడీపీ. మొత్తానికి ఈ ఆరోపణల్లో నిజానిజాలు తెలాల్సి ఉండగా… ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Exit mobile version