NTV Telugu Site icon

మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నాం : చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకువచ్చిన రైతు చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నయంటూ రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు దిగారు. అంతేకాకుండా చాలా మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టాలను రద్ద చేస్తున్నట్లు ప్రకటించారు.

దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్ధం చేసుకోవడం శుభ పరిణామని అని కొనియాడారు. గత సంవత్సరం నవంబర్‌ 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం 3 సాగుచట్టాలను ప్రకటించిన విషయం తెలిసిందే.