NTV Telugu Site icon

Chandrababu Naidu: అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై దాడులా..? ఇదేం రాజకీయం..

Chandrababu Naidu

Chandrababu Naidu

తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది.. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం, వాగ్వాదం, దాడుల వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, కేసుల పరంపర కూడా కొనసాగుతోంది.. అయితే, కుప్పంలో జరిగిన పరిణామాలపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు చంద్రబాబు నాయుడు.. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై దాడులా..? ఇదేం రాజకీయం..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కుప్పంలో కొత్త సంస్కృతి కోసం వైసీపీ విఫలయత్నం చేస్తోంది.. దాడులు, కేసులు, వేధింపులతో ప్రశాంత కుప్పంలో కక్ష, ఫ్యాక్షన్ రాజకీయాలను తేవాలని విశ్వ ప్రయత్నం చేస్తోందని.. వైసీపీ కుట్రకు కొందరు పోలీసులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు..

Read Also: Pregnant Woman Carried On JCB: జేసీబీయే అంబులెన్స్‌గా మారింది.. ఆస్పత్రికి గర్భిణి తరలింపు

స్వచ్ఛమైన కుప్పంలో ఈ కుళ్ళు రాజకీయాలు నిలబడవు.. ఈ చర్యలకు తెలుగుదేశం తడబడదని స్పష్టం చేశారు చంద్రబాబు.. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ పై కూడా దాడి చేయాలనే ఆలోచన చేసిన రాజకీయ నేతలు మన దగ్గర అధికారంలో ఉండటం దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ పై వైసీపీ గుండాలు దాడి చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేకపోవడం చాలా దారుణం అన్నారు.. పోలీసు అధికారులు ఇలాగే అచేతనంగా ఉంటే కష్టమన్న ఆయన.. ఈ వైసీపీ రౌడీ మూక రేపు డీజీపీ ఛాంబర్లోకి వెళ్లి పోలీస్ బాస్ టోపీ ఎత్తుకెళ్లినా ఆశ్చర్యం లేదంటూ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు చంద్రబాబు నాయుడు. కాగా, కుప్పం ఘటనలపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఆ శాఖకు తీరని మచ్చగా పేర్కొన్న ఆయన.. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆర్టికల్ 19ను ఉల్లంఘిస్తూ అసమ్మతి స్వరాన్ని అణిచివేస్తోందని మండిపడ్డారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే ఎమ్మెల్సీ భరత్ శాంతి భద్రతల సమస్య సృష్టించారనేది సుస్పష్టమని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.