విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… సీఎం వైఎస్ జగన్‌కు స్టీల్ ప్లాంట్‌పై చిత్తశుద్ధి ఉంటే… తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.. కాసేపటి క్రితం టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించారు.. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా అన్ని శక్తులను కేంద్రీకరించాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు పార్టీ నేతలు.. అయితే, వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఇక, ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతల మండిపడ్డారు.. ఆస్తుల కోసమే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్లను మూసివేసే దిశగా ఒత్తిడి తెస్తుందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఎయిడెడ్ స్కూళ్ల వ్యవస్థను యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.. మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు బాబు దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించారు చంద్రబాబు.. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ చేస్తోన్న పోరాటాన్ని కొనసాగించాలని నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.. ఇక, మంత్రి నారాయణ స్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను తొలగించడం దుర్మార్గమంటోంది తెలుగుదశం పార్టీ.