ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా జేసీ బ్రదర్స్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని కేసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో కూడా ఉండివచ్చారు.. రిలీజైన వెంటనే మళ్లీ కేసులు వెంటాడాయి. ఇక, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. దీంతో.. ఆయనపై 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు.
జేసీపై మరో కేసు నమోదు

JC Prabhakar Reddy