ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టం నుండి ఒక తూర్పు పడమర ద్రోణి.. ఉత్తర అరేబియా సముద్రం నుండి దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ మీదుగా & ఉత్తర మహారాష్ట్ర మరియు తెలంగాణ మీదుగా 3.1 కి.మీ & 4.5 కి.మీ.ల మధ్య ఎత్తుతో దక్షిణ దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై 21 న వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
15° N లాట్ వద్ద సగటు సముద్ర మట్టం నుండి సుమారు 3.1 కిమీ మరియు 5.8 కిమీ మధ్య గల తూర్పు పశ్చిమ షీర్ జోన్ దక్షిణ దిశ కు వంగి… ఇప్పుడు బలహీన పడింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర & పరిసరాలపై ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల వరకు విస్తరించి…ఇప్పుడు బల హీన పడింది వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.