Site icon NTV Telugu

Swamy Srinivasananda Saraswati: వినాయకచవితిపై ఆంక్షలెందుకు?

Srinivasananda

Srinivasananda

వినాయకచవితి సందర్భంగా ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. వినాయక చవితి సందర్భంగా మండపాలకు వెయ్యి రూపాయలు ఎందుకు వసూలు చేయాలి? ఇతర మతాలకు చెందిన పండుగలకు ఏ ఆంక్షలు వుండవ.. కానీ వినాయక చవితిపై ఎందుకీ వివక్ష అన్నారాయన. పండుగను ఆనందంతో చేసుకోనివ్వడంలేదు…నిర్వహకులను రకరకాల భయాలు కలిగిస్తున్నారు..హిందువులు ఓట్లు వేసి గెలిపించడమే మేము చేసిన తప్పా? అన్నారు శ్రీనివాసానంద సరస్వతి.

Read Also: COVID 19: దేశంలో 10 వేలకు పైగా కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు

ఇతర మతాల పండుగలకు లేని ఆంక్షలు హిందువుల పండుగలు ఎందుకు…? హిందూ మనోభావాలను పరిగణలోకి తీసుకోరా అన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఎక్కడున్నారు..మీరు స్పందించరా…? మండపాలు పెట్టకముందే నిర్వహకులను స్టేషన్లకు రప్పించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి….? మైనార్టీల ముఖ్యమంత్రి అనే ముద్ర జగన్ కు వుంది..ఆ ముద్ర చెరుపుకోండి..షరతులను తొలగించాలి…తీరు మార్చుకోవాలి లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ నిర్ణయాలను బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎంతో అట్టహాసంగా జరిగే వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Read Also: YSR Nethanna Nestham Jagan Live Updates: వైఎస్సార్ నాలుగో విడత నేతన్న నేస్తం లైవ్ అప్ డేట్స్

Exit mobile version