సీఎం జగన్ పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించారని, కేరళ కూర్గ్ లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పరిపూర్ణానంద స్వామీజీ. కరోనా బారినుండి ప్రజలు కాపాడి,తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలని స్వామిని వేడుకున్నానని చెప్పారు. తిరుమల కొండపై ఆహ్లాదకరమైన, అభివృద్ధిని పెంపొందిస్తూ టీటీడీ పటిష్టమైన నియమ నిబంధనలు కొనసాగించాలన్నారు. టీటీడీ మరిన్ని ధార్మిక కార్యక్రమాలను మంచి ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని స్వామిని కోరుకున్నానని పరిపూర్ణానంద స్వామీ చెప్పారు.గతంలో నిర్లక్ష్యానికి గురైన వకుళా మాత ఆలయాన్ని చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి…