NTV Telugu Site icon

Swamyji Sampoornananda: విశాఖలో బయటపడ్డ కీచక స్వామీజీ లీలలు.. బాలికపై లైంగిక దాడి

Vizag Keechaka Swamy

Vizag Keechaka Swamy

Swamiji Sampoornananda Molested Young Girl In Vizag: అందరూ కాదు కానీ, కొందరు మాత్రం స్వామీజీ ముసుగులో ఎన్నో అచారకాలకు పాల్పడుతున్నారు. అక్రమ దందాలు నడపడమే కాదు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మాయమాటలు చెప్పి ముసుగులో దింపడమో, తమ మాట వినకపోతే బలవంతంగా లొంగదీసుకోవడమో చేస్తున్నారు. చివరికి.. మైనర్ బాలికల్ని కూడా విడిచిపెట్టడం లేదు ఈ కామాంధులు. ఇప్పుడు విశాఖపట్నంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్వామీజీ ముగుసులో లీలలు కొనసాగిస్తున్నట్టు గుట్టు రట్టయ్యింది. ఓ బాలిక సాహసం వల్లే.. ఆ స్వామీజీ బండారం బయటపడింది.

Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై అంబటి సంచలన ఆరోపణలు.. రష్యాలో ఫైల్ ఓపెన్

ఆ స్వామీజీ పేరు సంపూర్ణనంద. విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలో శ్రీశ్రీశ్రీ జ్ఞానానంద పేరుతో ఒక ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ ఆశ్రమంలో ఓ బాలిక పెరుగుతోంది. రాజమండ్రి దగ్గరలోని గండెపల్లికి చెందిన ఆ బాలిక.. చిన్నప్పుడే తన తల్లిదండ్రుల్ని కోల్పోయింది. తనకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో చేరింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న ఆ బాలికపై కీచక స్వామి లైంగిక దాడి చేశాడు. ఈ ఘాతుకంతో నరకం అనుభవించిన ఆ బాలిక.. చాకచక్యంగా వ్యవహరించి, ఆ ఆశ్రమం నుంచి బయటపడింది. వారి కంట పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో, ఎక్కడికైనా పారిపోవాలనుకొని, ఓ ట్రెయిన్ ఎక్కింది. ఆ ట్రెయిన్‌లో కంకిపాడుకు చెందిన ఓ కుటుంబానికి ఆ యువతి దొరికింది. తనకు జరిగిన అన్యాయం గురించి వారికి వివరించింది.

Honor Killing: మధ్యప్రదేశ్ లో పరువు హత్య.. ఇద్దరినీ చంపి నదిలో మొసళ్లకేశారు

ఆ కుటుంబం సహాయంతో ఆ బాలిక విజయవాడ సీడబ్ల్యూసీకి చేరింది. అంతకుముందే ఆ కుటుంబం కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఆ బాలికని తీసుకెళ్లి, విజయవాడ సీడబ్ల్యూకి ఆ కుటుంబం అప్పగించింది. సీడబ్ల్యూసీ ద్వారా ఆ బాలిక దిశ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Show comments