NTV Telugu Site icon

SV Vedic Varsity VC: ఎట్టకేలకు వీసీ సుదర్శనశర్మపై వేటు

Svvu Tirupati

Svvu Tirupati

ఎస్వీ వేదిక్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ సుదర్శన శర్మ పై వేటు వేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్దంగా ఇప్పటికే మూడు పర్యాయాలు వైస్ ఛాన్సలర్ గా కొనసాగారు సుదర్శన శర్మ. ఎట్టకేలకు ఆయనపై వేటు వేసింది. గత ఏడాది నవంబర్ లోనే వీసీ సుదర్శన శర్మ పదవీకాలం ముగిసింది. ఇన్ ఛార్జి వైస్ ఛాన్సలర్ నిబంధనలకు వ్యతిరేకంగా పదవిలో కొనసాగారు సుదర్శనశర్మ.

నూతన వైస్ ఛాన్సలర్ నియామకం జరగకుండా సేర్చ్ కమిటీకి సుదర్శనశర్మ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. సుదర్శనశర్మ వ్యవహారశైలి పై మండిపడ్డారు టీటీడీ అధికారులు. వైస్ ఛాన్సలర్ నియామకం సాఫీగా సాగే వరకు ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా అదనపు ఇఓ ధర్మారెడ్డిని నియమించాలని ప్రభుత్వాని కోరింది టీటీడీ. ఎట్టకేలకు సుదర్శనశర్మ పై వేటు వేసి అదనపు ఇఓ ధర్మారెడ్డిని ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా నియమించింది ప్రభుత్వం. త్వరలోనే నూతన వైస్ ఛాన్సలర్ నియామకం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

LIVE : అక్షయ తృతీయ సందర్భంగా సిరులతల్లికి విశేష పూజలు