NTV Telugu Site icon

పీఆర్సీ పై వీడని పీటముడి.. సీఎంతో చర్చలు లేనట్టేనా..?

పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్‌మెంట్‌, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, ఆందోళన విరమణపై ఉద్యోగ సంఘాల జేఏసీలే స్పష్టత ఇవ్వాల్సి ఉందంటున్నారు.

ఇక, ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం లేన్టటుగా తెలుస్తోంది.. మరోవైపు.. రేపు మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి విశాఖ వెళ్లనున్నారు.. దీంతో.. ఇప్పట్లో ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ సీఎం చర్చలు కష్టమనే చర్చ కూడా సాగుతోంది. మరి సీఎంతో చర్చలు లేకుండానే దీనికి ఆర్థిక మంత్రి, ప్రభుత్వ సలహాదారు పులిస్టాప్‌ పెడతారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది… కాగా, పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెడితేనే చర్చలు ముందుకు సాగుతాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.. దీంతో.. ఇవాళ చర్చలు ఎలా జరుగుతాయని అనేది ఆసక్తికరంగా మారింది.