NTV Telugu Site icon

AP Three Capitals: మూడు రాజధానులపై రేపు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Ap Three Capitals

Ap Three Capitals

AP Three Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. మూడు రాజధానుల చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదన్న హైకోర్టు.. అమరావతి ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట గడువు పెట్టింది.. ఆరు నెలలలోపు రాజధాని నిర్మాణం పూర్తి కావాలని పేర్కొంది.. అయితే, హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చాలెంజ్‌ చేసింది వైఎస్‌ జగన్‌ సర్కార్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. అయితే, గత నవంబర్‌లో విచారణ సందర్భంగా మౌలిక సదుపాయాల కల్పన డెడ్ లైన్లపై స్టే విధించింది సర్వోన్నత ధర్మాసనం.. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. ఇక, రాజధానుల విషయంలో దాఖలైన కేసుల్లో ప్రతి వాదులు సైతం రేపు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.. దీంతో, ఈ కేసులో ఎలాంటి విచారణ జరుగుతోంది.. ఎవరు ఎలాంటి వాదనలు వినిపిస్తారు.. రేపు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

Read Also: Revanth Reddy : మన మట్టిలో పుట్టిన మరో ఆణిముత్యం ‘త్రిష’

ఏపీలో మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో ప్రభుత్వం కోరింది.. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. కాలపరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ది చేసి మూడు నెలల్లోపుగా భూ యజమానులకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించింది.. కానీ, అమరావతి రాజధానిపై మాత్రం స్టే ఇవ్వలేదు. దీంతో.. రేపటి విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.. కాగా, చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న రాజధాని అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ.. కర్నూల్‌ను న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.. మూడు రాజధానులను విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నా.. వెనక్కి తగ్గేదేలే అనే విధంగా ముందుకు సాగుతున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.