NTV Telugu Site icon

Andhra Pradesh: వైఎస్ వివేకా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Ys Viveka Case

Ys Viveka Case

Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసును విచారిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి కూతురు సునీత పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.