వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది… రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది.. ఇక, ఈ సమయంలో రఘురామ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగా భావించాలని సూచించింది.. తెలంగాణ హైకోర్టు ఒక జ్యుడీషియల్ అధికారిని నామినేట్ చేస్తుందన్న సుప్రీంకోర్టు.. ఆ జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ.. ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్టార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయాలని.. వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.. ఇక, వైద్య పరీక్షల ఖర్చును మొత్తం రఘురామకృష్ణం రాజే భరించాలని పేర్కొంది సుప్రీంకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. కాగా, ప్రస్తుతం గుంటూరు సెంట్రల్ జైలులో రఘురామకృష్ణంరాజు ఉన్న సంగతి తెలిసిందే.