Sunil Deodhar Sensational comments on andhra pradesh government: ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ కర్నూలులో సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా తెలుగు ప్రజల పేరు మారుమోగిందని కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం అవినీతి వల్ల రాష్ట్ర ప్రజలు నిరాశతో ‘పోవాలి జగన్’ అంటూ పాడుతున్నారని అన్నారు. ఏపీలో రెండూ అవినీతి, కుటుంబ పార్టీలే కులతత్వ, హిందూ వ్యతిరేక పార్టీలే అని అన్నారు. రెండు దొంగల పార్టీ, టీడీపీలో జన్మ భూమి సభ్యుల దోపిడీ, ఇప్పుడు వాలంటీర్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, ఆంగ్ల విద్యా బోధనను కోర్టుకు వెళ్లి బీజేపీ ఆపింది, ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలి జగన్ తెలుగును హత్య చేస్తున్నారని ఆయన అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్ లో మెడికల్, ఇంజనీరింగ్ హిందీ లో ఉంది. జగన్ ఏపీలో కూడా తెలుగులో ఎందుకు ఈ విద్యను ప్రవేశపెట్టారు, బీజేపీ ప్రభుత్వం వస్తే తెలుగులో మెడికల్, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు తెలుగులో ప్రవేశపెడతామని ఆయన అన్నారు.
TTD: అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. కీలక చర్యలు చేపట్టిన టీటీడీ
ఏపీలో తెలుగు విద్యను రద్దు చేసి ఇంగ్లీష్ ప్రోత్సహించి వీరిని క్రిస్టియన్ మిషనరీస్ కు మార్చే కుట్ర జరుగుతోందని, అందుకే క్రిస్టియన్ పాస్టర్లకు, ముస్లిం మౌలనాలకు ఎందుకు జీతం ఇస్తున్నారని అన్నారు. హిందువులను క్రిస్టియన్స్ గా, ముస్లింలుగా మార్చే కుట్ర చేస్తున్నాడని, చర్చ్, మసీదు నుండి వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రాదు, కేవలం హిందువుల డబ్బు మాత్రమే వస్తోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాస్టర్లకు, మౌలానాలకు ఇచ్చే జీతం రద్దు చేస్తామని ఆయన అన్నారు. కేరళ స్టోరీ సినిమా అందరూ చూడాలి, కేరళలో 50 ఏళ్లుగా జరుగుతున్నది, ఇప్పుడు ఏపీలో జరుగుతుందని ఆయన అన్నారు. లవ్ జిహాద్ పేరుతో అక్రమంగా మతం మార్పు జరుగుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తే జిహాదీ కార్యక్రమాలను అడ్డుకుంటామని, పుణ్యక్షేత్రాల పై దాడిని అడ్డుకుంటామని అన్నారు. అలా బీజేపీ ముస్లిం,క్రిస్టియన్ వ్యతిరేకి కాదు,మోడీ అన్ని మతాల వారికి పథకాలు ఇచ్చారని ఆయన ఈ క్రమంలో పేర్కొన్నారు.
Sunil Deodhar: కేరళ స్టోరీ సినిమా అందరూ చూడాలి.. అదిప్పుడు ఏపీలో జరుగుతోంది!
Show comments