Sunil Deodhar: జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Deodhar Gives Clarity On Alliance With Janasena Party In AP: మంగళగిరి సభలో తాను బీజేపీతో కలిసి ముందుకు సాగలేనంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్పడం, ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబుని కలవడంతో.. బీజేపీకి జనసేన గుడ్‌బై చెప్పేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీ కో-కన్వీనర్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలేనని విమర్శించిన ఆయన.. భవిష్యత్తులో కూడా టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. జనసేనతో రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. విశాఖలో జరిగిన ఘటనపై పవన్ కళ్యాణ్‌తో చాలామంది బీజేపీ నేతలు మాట్లాడారని, సంఘీభావాన్ని తెలిపారని పేర్కొన్నారు.
కాగా.. బీజేపీ తనకు ఇప్పటికీ వైసీపీ పోరాటం విషయంలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, ఇంకెంత కాలం వేచి చూడాలని మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తనకు బీజేపీపై, అలాగే ప్రధాని నరేంద్ర మోడీపై గౌరవం ఉన్నా.. వారికి ఊడిగం మాత్రం చేయబోనని పవన్ తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు కుదిరినప్పటికీ.. తాను బలంగా పని చేయలేకపోయానని అన్నారు. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై పోరాడడానికి బీజేపీ ముందుకు రాకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ తీరు కారణంగానే తాను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చిందని.. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖ చిత్రం చూస్తారని పవన్ ఆయన చెప్పారు. ఆ మాట చెప్పిన కొన్ని గంటల్లోనే చంద్రబాబుని కలవడంతో.. బీజేపీతో తెగదెంపులు చేసుకొని, టీడీపీతో పవన్ మరోసారి జత కట్టబోతున్నారన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఉలిక్కి పడ్డ బీజేపీ.. జనసేనతో పొత్తు సాగుతుందని స్పష్టం చేసింది.
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
తాజావార్తలు
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!