Sunil Deodhar: సీఎం వైఎస్ జగన్‌ఫై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోదర్.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని ఆరోపించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే జాబు ఇస్తానన్నాడు.. జాబు రాలేదు.. రాష్ట్రంలోకి గంజాయి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని లిక్కర్, ఇసుక మాఫియగా మార్చారని ధ్వజమెత్తిన ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.. పోవాలి జగన్, పోవాలి జగన్.. మన జగన్ అంటూ జనం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, కేంద్ర ప్రభుత్వ పథకాలని తమ పథకాలుగా వైఎస్ జగన్ ప్రచారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు.. రావాలి జగన్.. కావాలి జగన్.. అంటూ ప్రజలను మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు.. నేను విన్నాను, నేను వున్నానంటూ నినాదంతో ఎన్నికల్లో గెలిచారు.. కానీ, వైఎస్ జగన్ ఫ్యాన్ లో గాలిలేదు అంటూ ఎద్దేవా చేశారు సునీల్ ధియోదర్.. కాగా, బీజేపీ క్రమంగా అధికార వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉంది.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. అది మరింత పెరిగింది.
Read Also: CM KCR : రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం