ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై అప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో పొత్తులపై మాట్లాడిన బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్.. మరోసారి క్లారిటీ ఇచ్చారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై పలు రకాల వార్తలు వస్తున్నాయి.. టీడీపీ, వైసీపీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, జనసేన పార్టీతో మాత్రమే పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు స్పష్టం చేయండి అని సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. వాటికి ధీటుగా సమాధానం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సునీల్ దియోధర్.
Read Also: Minister Dharmana: సీఎం జగన్‌పై ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు