Site icon NTV Telugu

Students Clash: విశాఖలో నడిరోడ్డుపై స్కూల్‌ విద్యార్థుల రచ్చ.. గ్రూపులుగా విడిపోయి తన్నుకున్నారు..

Students Clash

Students Clash

విద్యార్థులు బుద్దిగా స్కూల్‌కు వెళ్లాలి.. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వినాలి, చదువుకోవాలి.. క్లాస్‌ వర్క్‌లు, హోం వర్క్‌లతో బిజీగా ఉండాలి.. సమయం దొరికితే సరదా ఆటలు, పాటల్లో మునిగి తేలాలి.. కానీ, స్కూల్‌ ఏజ్‌లోనే రోడ్డుపై రౌడీల వలే గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటే ఏంటి? పరిస్థితి.. ఇదే ఇప్పుడు విశాఖపట్నంలో జరిగింది.. గుంపుగా రోడ్డుపైకి చేరుకున్న విద్యార్థుల మధ్య.. అసలు గొడవ ఎందుకు మొదలైందో తెలియదు.. కానీ, గ్రూపులుగా విడిపోయి.. తన్నుకున్నారు.. పిడిగుద్దుల వర్షం కురిపించారు.. విశాఖలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

Read Also: Mehbooba Mufti: ముస్లింలను దెయ్యాలుగా చూపించే ప్రయత్నమే “కాశ్మీర్ ఫైల్స్” సినిమా

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధురవాడ చంద్రంపాలెం దగ్గర స్కూల్ విద్యార్థులు బరితెగించారు.. నడిరోడ్డుపై రౌడీల్లా గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనతో అంతా విద్యార్థులు? ఇలా తన్నుకోవడం ఏంటిరా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.. నడ్డి రోడ్డుపై విద్యార్థుల ప్రవర్తన చూసి బిత్తరపోయారు స్థానికులు.. విద్యార్థులు చదువుతో పాటు.. పోరాటం చేయాలి.. అది కూడా చదువుకు సంబంధించినదై ఉండాలి.. తన స్కూల్‌లో సమస్యలపై ఉండాలి.. కానీ, ఇలా రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవడం ఏంటిరా? అని మండిపడుతున్నారు పెద్దలు..

Exit mobile version