NTV Telugu Site icon

Chittoor: అనుమానంతో వేడి నూనెలో చెయ్యి పెట్టాలన్న భర్త .. అందుకు భార్య ఏం చేసిందంటే..?

Untitled 19

Untitled 19

Chittoor: కంప్యూటర్ కాలంలో కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు మనుషులు. మూఢ నమ్మకాలతో విచక్షణ కోల్పోతున్నారు. ఏం చేస్తున్నామో కూడా ఆలోచించ లేని దయనీయ స్థితిలో ఇప్పటికీ కొందరు మనుషులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నాడు రాముడు సీత అగ్ని ప్రవేశం చేయమన్నాడు.. నేను నా భార్యను నూనె ప్రవేశం చేయమంటే తప్పేంటి అనుకున్నాడు ఓ వ్యక్తి.. అందుకు భర్య కూడా సరే అని తలఊపింది. ఈ ఘటన చిత్తూరు లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని పూతలపట్టు మండలం లోని తేనేపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీలో గుండయ్య, గంగమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. అయితే గుండయ్యకు తన భార్య గంగమ్మ పై అనుమానం పెరిగి పంచాయతీ పెట్టాడు.

Read also:World Cup Final 2023: టీమిండియాకు కలిసొచ్చిన బుధవారం.. ఇక ఛాంపియన్ రోహిత్ సేననే!

ఈ నేపథ్యంలో వారి ఆచార ప్రకారం ఊరి నడిబొడ్డున అందరూ ఉండగా మరిగే నూనెలో భార్య చేతులు ముంచాలి. అప్పుడు ఆమె చేతులు కాలి బొబ్బలక్కపోతే గంగమ్మ నిరపరాదని వారు నమ్ముతారు. ఇందుకు గుండయ్య అన్ని సిద్ధం చేసాడు. పసుపు కుంకుమ పూసి పూలు చుట్టి మట్టి పాత్రలో నూనె పొసి పొయ్యి మీద పెట్టి సలసల మరిగించాడు. అనంతరం భార్య ను ఆ నూనెలో చేతులు ముంచాలని.. బహిరంగ సత్య నిరూపణ చెయ్యాలని భర్త మొండిపట్టు పట్టాడు. అందుకు భర్య కూడా నేను ఏ తప్పు చేయలేదు. కనుక నేను సత్యా నిరూపణ కు సిద్ధమే అంటూ మరిగే నూనెలో చేతులు ఉంచేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పూతలపట్టు ఎంపీడీవో గౌరీ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మూఢ ఆచారాన్ని అడ్డుకున్నారు.