NTV Telugu Site icon

బిగ్‌ బ్రేకింగ్: ఏపీలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు

Adimulapu Suresh

Adimulapu Suresh

విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతో అడుగులు ముందుకు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడియన మంత్రి ఆదిమూలపు సురేష్.. సుప్రీంకోర్టులో పరీక్షలపై విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించారు.. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందన్న ఆయన.. కానీ, సుప్రీకోర్టు చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామని తెలిపారు.. అనేక తర్జన భర్జనల అనంతరం పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.

ఇంటర్ పరీక్షలని రద్దు చేస్తున్నామని వెల్లడించిన ఆయన.. అంతేకాదు.. పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు… అయితే, మార్కుల అసెస్మెంట్ ఏ విధంగా చేయాలనే దానిపై హైపవర్ కమిటీని నియమించామన్నారు.. ఇక, తాము పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగానే ఉన్నాం… ఇదే విషయాన్ని అఫిడవిట్‌లోనూ చెప్పాం.. కానీ, సుప్రీం పెట్టిన డెడ్ లైన్ లోపల పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని.. అందుకే పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.