Site icon NTV Telugu

Union Minister Rammohan Naidu: ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన.. ఆ సంస్కృతి మాది కాదు..!

Rammohan Naidu

Rammohan Naidu

Union Minister Rammohan Naidu: ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్ – 2 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.. పాతపట్నం నియోజకవర్గంలోని బూరగాం గ్రామంలో 265 కోట్ల రూపాయలతో ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగా ఇసుక మాఫియా, భూధందాలు, లిక్కర్ మీద సొమ్ము చేసుకోవడం లేదన్నారు.. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి కూడా మా కూటమి ప్రభుత్వానిది కాదన్నారు.. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వాతంత్రం వచ్చేటట్లుగా స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని పేర్కొన్నారు.. ప్రజలు ఎవరైనా సమస్యలు పరిష్కరించుకుంటే మమ్మల్ని అక్కడికక్కడే నిలదీస్తే మేం వారిపై ఎటువంటి అధికార జులుం ప్రదర్శించకుండా.. సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.

Read Also: Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలో ఇండియా టర్న్స్ పింక్ సంస్థ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా CSR ద్వారా మహిళలకు ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు.. ఈ కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 10,000 మంది గ్రామీణ మహిళలకు ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పించబడుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం మహిళలో అవగాహన పెంపొందించి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, తద్వారా జీవితాలను రక్షించడం అన్నారు.. ఈ కార్యక్రమంలో నాతో పాటు AAI చైర్మన్ విపిన్ కుమార్, HR సభ్యులు శ్రీనివాస్, ఇండియా టర్న్స్ పింక్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్ మరియు బగ్గు రమణ మూర్తి పాల్గొన్నారు. గ్రామీణ సమాజాలలోని మహిళలకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ మరియు ముందస్తు రోగ నిర్ధారణ సేవలను అందించేందుకు మేం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు…

Exit mobile version