NTV Telugu Site icon

Ram Mohan Naidu: ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. ఆయన ఆశయాలు కొనసాగిస్తాం

Rammohan Naidu

Rammohan Naidu

స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న పనిచేశారని పేర్కొన్నారు. నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు.

Read Also: Sudeep : హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు

ఐదేళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి పోయిందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మను గెలిపించండని ఆయన కోరారు. జగన్ అహంకారం లెక్కలేనితనం కారణంగానే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని దుయ్యబట్టారు. అయినా ఆ పార్టీ ధోరణిలో మార్పు రావటం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు.. వైసీపీని ప్రజలు మర్చిపోయారు కాబట్టే ఏదో ఒక హంగామా చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Read Also: Group-2 Mains: సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అంధ విద్యార్థినికి అన్యాయం..

వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటం చేయటం లేదు.. జగన్‌కు ప్రతిపక్ష హోదా రాలేదని, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వకూడని పోరాటం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రజలు కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను స్వాగతిస్తున్నారు.. మోడీ, చంద్రబాబు, పవన్‌ల నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పెద్దఎత్తున జరుగుతుందని తెలిపారు. మాజీ సీఎం అయిన జగన్‌కు ఎన్నికల కోడ్ తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలన్నది ఆ పార్టీ అభిమతం.. అలాంటి కుట్రలు సాగనివ్వమని రామ్మోహన్ నాయుడు తెలిపారు.