NTV Telugu Site icon

Minister Atchannaidu: ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్‌ స్థాయి విద్య.. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు..

Minister Atchannaidu

Minister Atchannaidu

Minister Atchannaidu: ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో 5 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. విద్యా ప్రమాణాల మెరుగుకు శ్రీకారం చుడతామన్నారు. తల్లిదండ్రుల సహకారం భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు మెరుగు పరచాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తుందని చెప్పారు. 16 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గ‌త వైసీపీ పాలనలో ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రుల సమావేశాలు మొక్కుబడిగా సాగేవని, ఐదేళ్ల కాలంలో విద్యావ్యవ‌స్ధల‌ను బ్రష్టు ప‌ట్టించార‌ని వివమర్శించారు..

Read Also: Pushpa 2 Bugga Reddy: సైలెంటుగా నాలుగు పాన్ ఇండియా హిట్లు కొట్టిన పుష్ప 2 విలన్

టెక్కలి నియోజ‌క వ‌ర్గం కోట‌బొమ్మాళి మండ‌ల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం) కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా శాఖలో ఒక్కొక్కటిగా సంస్కరణలు తీసుకువస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేవిధంగా అవ‌ర‌మైన చర్యలు ప్రారంభించామ‌ని తెలిపారు. ఉపాధ్యాయులు బోధిస్తే మంచి ఫలితాలు రావని భావించిన కూట‌మి ప్రభుత్వం తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చేయ‌డం ముఖ్యమ‌ని.. ఈ నేప‌థ్యంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)కు శ్రీకారం చుట్టామ‌ని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ఈ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశాల నిర్వ హిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

Read Also: Pushpa 2 Bugga Reddy: సైలెంటుగా నాలుగు పాన్ ఇండియా హిట్లు కొట్టిన పుష్ప 2 విలన్

కూట‌మి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకు వెళ్తూ మ‌రో ప‌క్క సంక్షేమ పథకాలు, విద్య ఉపాధి, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు అచ్చెన్నాయుడు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, కళాశాలల, పాఠశాలల్లో పారిశుభ్రత కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాలు నిర్వహించ‌డం ద్వారా క్రమశిక్షణ, విద్యాప్రగతి, ఇతర అంశాలపై చర్చించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. ఉపాధ్యాయులు, త‌ల్లితండ్రుల‌కు ఇటు వంటి స‌మావేశాలు నిర్వహించ‌డం ద్వారా పాఠ‌శాల‌కు వ‌చ్చే విద్యార్థలు వారి విద్యాబోధ‌న అంశాలపై స్వయంగా తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు..

Show comments