NTV Telugu Site icon

Duvvada Srinivas: తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ.. అందుకే ఇదంతా..!

Duvvada Srinivas

Duvvada Srinivas

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది.. రెండూ రోజులుగా దువ్వాడ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు.. అయితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ప్రెస్‌మీట్‌ పెట్టడంతో.. రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రాత్రి సమయంలో.. తన ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య వాణి, కుమార్తెపై దాడికి యత్నించిన దువ్వాడ శ్రీను.. వారిపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. మాది ముప్పై ఏండ్ల వైవాహిక జీవితం. గత రెండేళ్లుగా తీవ్రవిభేదాలు నడుస్తున్నాయి.. ప్రతి రోజూ మా ఇంటిలో గొడవలే. నా భార్యకు ఉన్న రాజకీయం కాంక్ష , ఆధిపత్యపోరే దీనికి కారణంగా చెప్పుకొచ్చారు.. నేనే ఎమెల్యే ‌కావాలి, బిజినెస్ నాపేరున ఉండాలి అనేది ఆమె వైనంగా పేర్కొన్న ఆయన.. పెళ్లి అయిన ఒకటి రెండు ఏళ్లకే ఇది మొదలైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: BSF: భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ శరనార్థులు.. అడ్డుకున్న బీఎస్ఎఫ్..’జై శ్రీరామ్’ అంటూ నినాదాలు

ఇక, తనకు టిక్కెట్ రాకపొతే నన్ను ఒడిస్తానని భార్య వాణి అనేది అని ఆవేదన వ్యక్తం చేశాడు దువ్వాడ శ్రీనివాస్.. నేను ఐదుసార్లు ఓడిపోవడానికి కారణం నా భార్య వాణియే అన్నారు.. నా ప్రథమ శత్రువు భార్య వాణినే అంటున్నారు.. విద్యార్థి దశ నుంచి రాజకీయల్లో వచ్చా.. పాతికేళ్లుగా ఎన్నో ఉద్యామాలు చేశా.. మరెన్నో కేసులు ఎదుర్కొన్నాను అన్నారు.. ఈ సారి మంచి అవకాశం వచ్చింది.. జగనన్న టిక్కెట్ ఇచ్చారు.. కానీ, నాకు టికెట్‌ కావాలని రచ్చ చేసిందన్నారు.. వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వద్దకు వెల్లి అధిష్టానానికి ఫిర్యాదు చేసింది.. నాకు విడాకులు కావాలని అడిగింది.. నేను టికెట్‌ త్యాగం చెసి అమెకు ఇచ్చాను. కానీ, వాణి గ్రాప్ పార్టీలో పడిపోయింది.. దీంతో ఎన్నికల ముందు నేను పోటీచేయాల్సి వచ్చిందన్నారు..

Read Also: Success Story: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.. కాంస్య విజేత అమన్ సెహ్రావత్ కథ

ఇక, పిల్లల్ని నాపై విశనాగుల్లా తయారు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ.. నామీద శత్రుత్వాన్ని నూరిపోసింది. ఎండ వాన తగలకుండా పిల్లల్ని బంగారంలా పెంచాను. ఇద్దరు పిల్లల్ని డాక్టర్స్ గా చదివించాను. ఏలోటు‌ లేకుండా చుసాను. ఆస్తులు రాశాను.. ఇల్లు , మైనింగ్ ప్యాక్టరీ ఇచ్చేశాను.. ఇంటికి రాకుండా నన్ను అడ్డుకుంటే.. మానసిక క్షోభకు గురైయ్యాను. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాను. నా పిల్లలు నా వద్దకు వచ్చారు.. నేను దర్జాగా వెళ్తాను.. కానీ, వచ్చే సమయంలో టీడీపీ మూకలతో కలసి వచ్చారు. మంత్రి అచ్చెంనాయుడు ఏదో కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఏ కేసు పెట్టినా గవర్నమెంట్ పెట్టినట్లు అవుతుందని, ఫ్యామిలీ నుంచి కొట్టెందుకు రెచ్చగొట్టారని మండిపడ్డారు.. నా అస్తులు , ఇల్లు అన్నీ రాసిచ్చాను.. ప్యాక్టరీ ఇచ్చాను. కోటి యాబై లక్షలు పిల్లల ఖర్చులకు‌ఇచ్చాను. ఏంటి నేను పిల్లకు లోపం చేశాను అని నిలదీశారు.. టిక్కెట్ విశయంలో తేడా కొట్టడంతో నన్ను‌, నా భార్య ఇంటికీ రానీయలేదు. హోటల్లో , బయట తింటూ తిరిగాను‌. నేను కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడకు, రాళ్లు, కారం, గునపాలు, నిచ్చెనలు తీసుకొని వచ్చారు. దశాబ్దాలుగా అంతర్గతంగా మా భార్య భర్తల మధ్య వార్ కొనసాగుతుంది. నాలుగు గొడలు దాటలేదు అన్నారు..

Read Also: AP IAS Officers Transfer: ఏపీలో మరో సారి ఐఏఎస్‌ల బదిలీలు..

మరోవైపు.. అసలు రాజకీయాల్లోకి దివ్వల మాధురిని తిసుకొచ్చింది వాణినే అన్నారు దువ్వాడ.. మాధురి అనే అమెను పావుగా చేసుకొని అధిష్టానానికి ఫిర్యాదు చేసింది.. మా కారణంగా మాధురి జీవితం నాశనం అయిపోయిందన్నారు.. దివ్వల మాధురి అత్తవారు, కన్నవారి దగ్గర మొత్తం కోల్పోయింది.. ఈ పరిస్థితులలో నేను ఓదార్పు ఇచ్చాను అన్నారు.. మా కుటుంబం వలన నీకు అన్యాయం జరిగిందని చెప్పాను. చనిపోవాల్సిన పనిలేదు.. అని మాధురికి భరోసా ఇచ్చాను అన్నారు.. మాధురిని పావుగా వాడి.. నన్ను బలిపశువు చేయాలని ఎత్తుగడ వేసిన మహా మహా రాజకీయ నేత దువ్వాడ వాణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దివ్వల మాధురి అనే మహిళ ట్రాప్ చేయటానికి నేనేం చిన్నపిల్లాడిని కాదు. మాధురికి నేను ఆస్తులు ఇవ్వాల్సిన పనేలేదు.. నా‌ఎలక్షన్‌కు రెండు కోట్లు మాధురి ఖర్చు చేసిందన్నారు.. నా దగ్గర ఇప్పుడు నయా పైసా లేదు. నేను ఇచ్చే పరిస్థితి కూడా లేదన్న ఆయన.. నాన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇదంతా రాంగ్ అని కొట్టిపారేశారు.. ఇక, గత రెండేళ్లలో భోజనం చేసావా? అని నన్ను ఎవరూ అడగలేదు. నాకు రెండు సంవత్సరాలుగా భోజనం అన్నీ మాదురీ చూస్తుంది అన్నారు.. ఎన్టీవీ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌ బయటపెట్టిన సంచలన విషయాల కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Show comments