Duvvada Srinivas: తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కథాలు వచ్చాయి.. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడమే కాదు.. రీల్స్ చేశారంటూ దివ్వెల మాధురిపై కేసు కూడా నమోదు చేశారు.. అయితే, ప్రీవెడ్డింగ్ షూట్ విషయంలో హాట్ కామెంట్లు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలిసిఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారు. తిరుమల కొండపై ఎలాంటి తప్పు , అపచారం చేయలేదని స్పష్టం చేశారు.. నాలుగు రోజులు తరువాత మాపై కేసులు పెట్టారు. వ్యక్తిగత అంశాలను పార్టీ పట్టించుకోదు. పార్టీకి నేనే చెప్పాను.. వైసీపీ నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదన్నారు.. పార్టీకి వ్యక్తి గత అంశాలను ముడిపెట్టవదన్నారు దువ్వాడ..
Read Also: Lotus Pond: లోటస్ పాండ్ వద్ద అపస్మారక స్థితిలో అర్ధనగ్నంగా యువతి..
మా లాంటి వారికి తిరుమల కొండపై దర్శనానికి అవకాశం ఉందా లేదా అనే విషయం టీటీడీ తెలియజేయాలన్నారు దువ్వాడ.. కేసులను కోర్టులలో ఎదుర్కోంటాం. హిందూ ధర్మం గూర్చే మాట్లాడే శక్తి మనకులేదు. సాంప్రదాయంలో బహు భార్యత్వం కూడా ఉందని గుర్తుచేశారు.. ఇక, వాణికి ఆస్తులు రాసేశాను.. పిల్లలకు అన్ని విధాలా అండగా ఉంటాను అన్నారు.. నేనే చేసింది తప్పు అని తెలిసినా.. తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందన్నారు.. నా మనసులో ఏం ఉందో అది బయటకు బహిర్గతం చేస్తున్నాం. ప్రజాజీవితంలో మళ్లీ మొదట నుంచి మెదలు పెడతాను. చట్టపరంగా తప్పుకాదు . సంఘం పరంగా ,మెరల్ గా సభ్యసమాజం దృష్టిలో తప్పే. మమ్మల్ని మన్నించి క్షమించండి అని ప్రజల్ని కోరుతున్నాను అన్నారు.. పడిపోయిన దగ్గర నుంచి లేస్తాను . ఇంట రచ్చ రెండు చోట్ల ఓడిపోయాను అన్నారు.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడారో తెలుసుకోవానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..