NTV Telugu Site icon

Divvala Madhuri vs Duvvada Vani: దువ్వాడ వాణికి షాకిచ్చిన దివ్వెల మాధురి..! ఈ ఇల్లు నాది.. ఏమైనా ఉంటే బయట చూసుకో..

Divvala Madhuri

Divvala Madhuri

Divvala Madhuri vs Duvvada Vani: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి వ్యవహారం మరోసారి రచ్చగా మారింది.. గత నెల రోజులుగా దువ్వాడ వివాదాస్పద ఇంటి దగ్గర దువ్వా వాణి, ఆమె కూతుర్లు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.. ఆ ఇంట్లోకి మమ్మల్ని అనుమతించాలని పట్టుబడుతున్నారు.. అయితే, ఈ కేసు మరో మలుపుతీసుకుంది.. వివాదాస్పదంగా మారిన దువ్వాడ శ్రీనివాస్‌ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు దివ్వెల మాధురి.. దీంతో.. ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి పై నుంచి మాధురి కనిపించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయారు వాణి.. ఆమె కూతురు.. బంధువులు.. దువ్వాడ ఇంట్లోకి మరోసారి ప్రయత్నించేందుకు యత్నించారు.. ఇదంతో ఓవైపు జరుగుతుంటే.. మరోవైపు ఓ వీడియో విడుదల చేసిన దివ్వెల మాధురి.. దువ్వాడ వాణికి షాకింగ్‌ విషయం చెప్పింది..

Read Also: Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన

వివాదాస్పదంగా మారిన ఆ ప్రాపర్టీ నాదే అంటూ ఓ వీడియో విడుదల చేశారు దివ్వెల మాధురి.. ఈ బిల్డింగ్ నా పేరు మీద ఉంది.. నా ఇంటిలోకి ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు.. అంతేకాదు.. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బైట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఇక, ఈ ఇల్లు నేను కోనుక్కున్నాను.. పోలీసులు నాకు రక్షణ కల్పించాలని కోరారు.. నేను ఓక్కదాన్నే ఉన్నా.. నాకు సెఫ్టీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, నేను గతంలో 2 కోట్ల రూపాయలు దువ్వాడ శ్రీనివాస్‌కి అప్పుగా ఇచ్చాను.. నా డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనును అడిగాను.. కానీ, డబ్బులు ఇచ్చే పరిస్థితిలో నేను లేను అంటూ బిల్డింగ్ రాసిచ్చారని తెలిపింది.. సెల్ఫ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అమ్మోచ్చు అని వెల్లడించారు దివ్వెల మాధురి..

Read Also: Hyderabad: మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..

అయితే, గతంలో నేను దువ్వాడ శ్రీనివాస్‌కు రెండు కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాను.. నేను ఏమీ ఆశించి ఆ డబ్బులు ఇవ్వలేదు అన్నారు దివ్వెల మాధురి.. రీసెంట్‌గా మరో రూ.50 లక్షలు కూడా శ్రీనివాస్‌ తీసుకున్నారని తెలిపారు.. దువ్వాడ శ్రీనివాస్‌ ముందు కట్టిన ఇల్లును సొంతం చేసుకున్న వాణి.. ఇప్పుడు కొత్త ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. నేను శ్రీనివాస్‌ను అడిగాను.. దాంతో ఆయన.. నేను నీకు అన్యాయం చేయను.. డబ్బులు ఇచ్చే పరిస్థితిలో నేను కాబట్టి.. ఈ ఇంటిని నీ పేరున చేస్తానని చెప్పారు.. దానికి అనుగుణంగా.. శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు నా పేరున రిజిస్ట్రేషన్‌ చేశారని తెలిపారు.. అంతేకాదు.. రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంటును కూడా ఆ వీడియోలో బయటపెట్టారు దివ్వెల మాధురి.. నేను దువ్వాడ శ్రీనివాస్‌ ఇంట్లో లేను.. నా ఇంటికే దువ్వాడ వాణి.. ఆమె పిల్లలు వచ్చి ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు.. ఇది నా ఆస్తి.. నేను కొనుగోలు చేసిన ఆస్తి.. దీనిపై ఎవరికీ రైట్‌ లేదని స్పష్టం చేశారు.. అయితే.. ఇంటి కరెంట్‌ కట్ చేశారు.. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.. నాకు రక్షణ లేదు.. దయచేసి పోలీసులు నాకు రక్షణ కల్పించాలని వీడియోలో విజ్ఞప్తి చేశారు దివ్వెల మాధురి..