NTV Telugu Site icon

CM Chandrababu: ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కానీ మనస్సు, మానవత్వం ఉంది..

Cm

Cm

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కానీ మనస్సు, మానవత్వం ఉందని అన్నారు. 3 మాసాల వరకు పింఛన్ మిస్సైనా తీసుకోండని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు బాగా పని చేస్తున్నారు.. ఒక్కరిద్దరు వల్ల చెడ్డపేరు వస్తుంది.. సచివాలయ ఉద్యోగుల ఫోన్లు జియో ట్యాగ్ చేసామని పేర్కొన్నారు. ఎవరైనా ఇంటి దగ్గర కాకుండా కార్యాలయం దగ్గర సచివాలయ ఉద్యోగులు పింఛన్ ఇస్తే.. వారి భరతం పడతామన్నారు. అలాగే.. ధాన్యం ఇచ్చిన 48 గంటల్లో రైతుల డబ్బులు వేస్తామని చెప్పారు. పోలీసులను గత ప్రభుత్వంలో ఇష్టానుసారం వాడుకున్నారు.. టీడీపీ, జనసేన కేడర్ పై ఇష్టానుసారం కేసులు పెట్టారు.. 143 రోజులుగా ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని ఆలోచిస్తున్నట్లు సీఎం చెప్పారు.

CM Chandrababu: తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు

10 లక్షల 50 వేల కోట్లు రాష్ట్ర అప్పు.. వడ్డీ లక్ష కోట్లు.. MRO ఆఫీసులు తాకట్టు పెట్టారు.. మందు బాబులను కూడా తాకట్టుపెట్టారు.. కల్తీ మద్యం ఏరులై పారింది.. ఇసుక అంతా అస్తవ్యస్తం.. ఫ్రీగా ఇద్దామన్నా అనేక సవాల్లు.. ఏ కేడర్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వొద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇసుక ఎక్కడైనా తవ్వుకోండి.. అడ్డుకుంటే తనకు కాల్ చేయండని సీఎం తెలిపారు. బెల్ట్ షాపు పెడితే పీడీ యాక్ట్ కేసు పెడతామని అన్నారు. మరోవైపు.. పోలవరం పడకేసింది, డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది.. కొత్త వాల్ రూ. 900 కోట్లు ఫేజ్ 1కి డబ్బులు ఇచ్చారని అన్నారు. అలాగే.. విశాఖని ఆర్ధిక రాజధాని చేస్తా.. శ్రీకాకుళంకి ఎప్పుడూ రుణ పడి ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతికి కేంద్రం సహకరిస్తుంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడుతున్నాం.. మెగా డీఎస్సీ ద్వారా డిసెంబర్‌లో ఉద్యోగాలిస్తాం.. యువతిని అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్.. యాక్ట్‌ని రద్దు చేశాం.. చెత్త పన్ను వేశారు.. కానీ చెత్త తీయలేదని ఆరోపించారు.

Ambati Rambabu: పోలవరంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం

రేపు గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడుతున్నాం.. రూ.826 కోట్లు గుంతలు పూడ్చడానికే ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. మూలపేట పోర్టు వద్ద 10 వేల ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్క్ కడతాం.. దానికి అనుబంధంగా ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. అలాగే.. రాష్ట్రంలో పెన్షన్లు అర్హులందరికి ఇస్తాం.. వెరిఫై చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఐదేళ్లలో శ్రీకాకుళం జిల్లా అంతటికి కుళాయి నీరు అందిస్తాం.. బెంతు ఓరియా సమస్యను పరిష్కరిస్తాం.. వెంటనే వారికి నెటివిటి సర్టిఫికేట్‌లు ఇస్తామని అన్నారు. కొబ్బరి రీసెర్చ్ పార్క్‌ని ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. మరోవైపు.. నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం.. పొట్టి శ్రీరాములును మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సీఎం అన్నారు. 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు.. అక్టోబర్ 1న నెహ్రూ ఆంధ్ర రాష్టం ప్రకటించారు.. 1956లో నవంబర్ 1న ఆంధ్ర- తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని తెలిపారు. అనేక తేదీలు ఉన్నాయి.. క్యాబినెట్‌లో చర్చించామని సీఎం పేర్కొన్నారు.

Show comments