NTV Telugu Site icon

Srikakulam: తమ్మినేని సీతారాంతో బొత్స సత్యనారాయణ భేటీ..

Bosta Tammineni

Bosta Tammineni

శ్రీకాకుళం జిల్లాలోని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వెళ్లారు. అరగంట పాటు వీరిద్దరూ చర్చించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ సీతారాం కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రమే వచ్చానని తెలిపారు. సీతారాం తనయుడు నానికి సర్జరీ జరిగిందని.. చూడటానికి వచ్చానని అన్నారు. మరోవైపు.. అతను దేనిని విమర్శించనని తెలిపారు. మంత్రి కొండపల్లి విషయం తనకు సంబంధం లేదని చెప్పారు. ఎవరు క్రియేట్ చేసారో వారే సమాధానం చెప్పాలని అన్నారు. ఆయనపై ఏం కోపం ఉందో ఆయనపై అలా ప్రచారం చేస్తున్నారు.. తనకు సంబంధ లేని విషయాలు తాను మాట్లాడనని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read Also: Sandhya Theatre Stampede: ఆరోజు ధియేటర్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు!

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. పార్టీ మారుతారన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. పీకపోయినా ఎవరైనా పవన్ కల్యాణ్ వైపు వెళ్తారా..? అని అన్నారు. గాలి ప్రచారాలు నమ్మొద్దు.. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కారణం ప్రజలకు తెలుసని చెప్పారు. తన కుమారుడికి సర్జరీ కోసం బయటకు వెళ్లానని పేర్కొన్నారు. తాను వైసీపీ పార్టీతోనే ఉంటానని తమ్మినేని సీతారాం చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా నియమించారు. ఇదే సమయంలో తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్‌చార్జిని నియమించారు. ఆముదాలవలస వైసీపీ ఇంఛార్జిగా చింతాడ రవికుమార్‌ను వైఎస్ జగన్ నియమించారు. ఈ క్రమంలో జగన్ నిర్ణయంతో తమ్మినేని సీతారాం అసంతృప్తికి గురయ్యారని.. జనసేనలో చేరాలనే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. తమ్మినేని సీతారాం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Read Also: Akhilesh Yadav: సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో లింగం ఉంది.. తవ్వకాలు జరపాలి..

Show comments