Site icon NTV Telugu

Duvvada Family Issue: దువ్వాడ ఇష్యూలో మరో ట్విస్ట్‌.. వివాదాస్పద ఇంటిలోకి దివ్వెల మాధురి.. ఉద్రిక్తత..

Duvvada Family Issue

Duvvada Family Issue

Duvvada Family Issue: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ నెలకొంది. దువ్వాడ వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంత కాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు యత్నిస్తున్నారు.. అంతేకాదు.. అక్కడే మకాం పెట్టారు.. గత నెల రోజుల నుంచి ఇంటి బయటే ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు.. అయితే, ఆ ఇంటిలోకి ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది.. దీంతో.. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.. దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటికి చేరుకోవడంతో.. ఇంటి ఆవరణలో నెలరోజులుగా నిరసన తెలుపుతున్న దువ్వాడ భార్య , బిడ్డల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు.. దీంతో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంగా ప్రకటించుకున్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంట్లోకి ప్రవేశించేందుకు వాణికి కోర్టు అనుమతి ఇవ్వగా. వివాధానికి కేంధ్ర బిందువైన ఇంటిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాదురి పేరుతో రిజిష్ర్టేషన్ చేసేసారు. గత నెలరోజులుగా అదే ఇంటి బయట అందోళన చేస్తున్న వాణి , దువ్వాడ కుమార్తలు బందువుల సహాయంతో ఇంటిలొకి వెల్లె ప్రయత్నం చెస్తున్నారు.

Read Also: Afzal Guru: “అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల లాభం లేదు”.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

కాగా, దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి వ్యవహారం రచ్చగా మారిన విషయం విదితమే.. దువ్వాడ కుటుంబ వ్యవహారం ఎంతకీ తెగకపోవడంతో.. వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది.. దువ్వాడకు ఊహించని షాక్‌ ఇచ్చింది.. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పోస్ట్‌ను తప్పించింది.. ఇక, దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ ను టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా నియమించిన విషయం విదితమే.. అయితే, గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు, దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది.. సుదీర్ఘంగా దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి దగ్గర.. తన పిల్లలతో కలిసి దువ్వాడ వాణి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుండగా.. ఇప్పుడు ఉన్నట్టుండి దివ్వెల మాధురి ఎంట్రీతో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version