Site icon NTV Telugu

High Tension in Raptadu: పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్.. రాప్తాడులో టెన్షన్‌ టెన్షన్‌..!

Jagan

Jagan

High Tension in Raptadu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు.. ఈ ఘటనలో లింగమయ్య తీవ్రగాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.. ఈ ఘటన రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ను పెంచింది..

Read Also: Chiranjeevi: పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరంజీవి..

ఈ హత్యపై రాజకీయ విమర్శలు లేకపోలేదు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువులు అనే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు.. అందుకే లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసులను పెట్టారని మండిపడ్డారు.. మరోవైపు.. బాధిత కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌.. ఈ రోజు నేరుగా వారి ఇంటికే వెళ్లి పరమార్శిస్తున్నారు.. కానీ, జగన్‌ టూర్‌ పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.. ఆ నియోజకవర్గం నుంచి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. జగన్‌ పర్యటనపై సునీత.. సోమవారం రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.. మేం ఆపాలి అనుకుంటే.. జగన్‌ వచ్చే హెలికాప్టర్‌ను ఇక్కడ దిగకుండానే వెనక్కి పంపించగలం.. మా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు.. కానీ, మా పార్టీ అధినేత చంద్రబాబు.. అలాంటి రాజకీయాలు మాకు నేర్పలేదని పేర్కొన్నారు.. అయితే, జగన్‌ పర్యటనను టీడీపీ శ్రేణులు.. లేదా కూటమికి చెందిన పార్టీల శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. మొత్తంగా వైఎస్‌ జగన్‌ పర్యటన.. రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్‌ వాతావరణాన్ని సృష్టిస్తోంది..

Exit mobile version