NTV Telugu Site icon

YS Jagan: రామగిరిలో వైసీపీ కార్యకర్త మృతి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జగన్

Ramagirir

Ramagirir

YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో గత రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ది పరామర్శించారు. లింగమయ్య కుమారుడు మనోహర్ తో ఫోన్లో మాట్లాడారు. తనకు ప్రాణహాని ఉందని జగన్ కి చెప్పిన లింగమయ్య కుమారుడు మనోహర్.. అన్ని రకాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ వారంలో పాపిరెడ్డిపల్లికి వస్తానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Read Also: Vijay Devarakonda: ‘కింగ్ డమ్’ కు తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం..

ఇక, వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యను మాజీ సీఎం జగన్‌ తీవ్రంగా ఖండించారు. లింగమయ్యను టీడీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించినందుకే హత్య చేశారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం ఆపాలని చెప్పుకొచ్చారు. పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.