NTV Telugu Site icon

MP Parthasarathy: మంత్రి సవితతో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ

Mp Parthasarathy

Mp Parthasarathy

MP Parthasarathy: మంత్రి సవిత.. హిందూపురం ఎంపీ పార్థసారథి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు హిందూపురం ఎంపీ పార్థసారథి.. కార్యకర్తల్ని విస్మరిస్తే, వారిని కాపాడలేక పోతే నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.. కానీ, మంత్రి సవితకు నాకు ఎటువంటి గొడవలు లేవు, కలిసే పని చేస్తాం అంటూ ఎంపీ పార్థసారథి వారి ఇరువురి మధ్య ఉన్న వైరానికి తెరదించారు.

Read Also: INDIA Bloc: చీలిక దిశగా ఇండియా కూటమి!? నాయకులు కీలక వ్యాఖ్యలు

కాగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పార్థసారథి ఆశించి భంగపడ్డారు, ప్రస్తుత మంత్రి సవిత అప్పట్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌ను సాధించి గెలిచి మంత్రి అయ్యారు. అప్పటినుండి పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి మరియు పార్థసారథి ఎంపీ వర్గాలుగా విడిపోయారనే విమర్శలు ఉన్నాయి.. ఈరోజు సోమందేపల్లిలో జరిగిన భగీరథ కళ్యాణమండపం భూమి పూజలో మంత్రి మరియు ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. సభలో మంత్రి మాట్లాడుతూ ఎంపీ పార్థసారథి 80 లక్షల రూపాయలు భగీరథ కళ్యాణ మండపానికి కేటాయించడం సంతోషకరమని అన్నారు. ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో స్వార్థపరులుగా తామిద్దరం వ్యవహరించినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.. తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని పరిటాల రవి, పరిటాల సునీత అప్పటి మంత్రి రామచంద్ర రెడ్డితో కలిసి పని చేసిన ఎప్పుడూ విభేదాలు రాలేదని మరి ఎందుకు ఇప్పుడు మంత్రి సవితతో విభేదాలు వచ్చాయో అర్థం కాలేదన్నారు.. అయితే, కొంతమంది స్వార్థపరులు ఇద్దరు మాట్లాడకుండా ఉంటే వారికి పబ్బం గడపదని విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. ఇద్దరి మధ్య విభేదాల వల్ల కార్యకర్తలు దెబ్బతింటున్నారని, ఇక నుండి తాము కలిసి పనిచేసి అభివృద్ధికి పాటుపడతామని ఎంపీ పార్థసారథి స్పష్టం చేశారు..

Show comments