Site icon NTV Telugu

Balakrishna Wife Vasundhara Devi: బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే..

Vasundhara Devi

Vasundhara Devi

Balakrishna Wife Vasundhara Devi: బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే.. నియోజకవర్గం అభివృద్ధి గురించే ఆలోచిస్తారని తెలిపారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి.. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని వీవర్స్ కాలనీలో జరిగిన సుప రిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన సంక్షేమ పథకాలపై, సమస్యలపై ఆరా తీశారు.. ఇక, తమకు అన్ని పథకాలు అందుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు లబ్ధిదారులు..

Read Also: PM Modi-Indira Gandhi: ఇందిరా గాంధీ రికార్డును బద్దలుగొట్టిన ప్రధాని మోడీ…

ఈ సందర్భంగా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి మాట్లాడుతూ.. హిందూపురం అభివృద్ధిపై ఈ నెల 31వ తేదీన ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఢిల్లీలో వివిధ శాఖల కేంద్ర మంత్రులతో కలిసి చర్చిస్తారని అన్నారు. గోళ్లపురం పారిశ్రామికవాడలో విద్యుత్తు సమస్య గతంలో ఉండేదని.. బాలకృష్ణ ఈ రోజు ఆ సమస్య లేకుండా చేశారని.. ఈ ప్రాంతంలో శుక్రవారం రోజు మహాలక్ష్మి వచ్చినట్టే విద్యుత్ వెలుగులు వస్తున్నాయి.. ఆ మహాలక్ష్మిని బాలకృష్ణ తీసుకొచ్చారు అని అభివర్ణించారు.. సుప రిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తీర్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు.. ఫ్రీ బస్సు కోసం మహిళలంతా ఎదురుచూస్తున్నారని.. వారంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు.. అయితే, బాలకృష్ణ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎక్కడున్నా కూడా.. ఆయన హిందూపురం అభివృద్ధిపై, సమస్యలపై దృష్టి సారిస్తున్నారని వెల్లడించారు.. మరోవైపు తన వృత్తిలో ఉంటూ హైదరాబాద్‌లో బసవకతారకం కాన్సర్ హాస్పిటల్‌పై బిజీగా వర్క్ చేస్తున్నారు అని పేర్కొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమతీమణి వసుంధర దేవి..

Exit mobile version