బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే.. నియోజకవర్గం అభివృద్ధి గురించే ఆలోచిస్తారని తెలిపారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి.. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని వీవర్స్ కాలనీలో జరిగిన సుప రిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.