Site icon NTV Telugu

Minister Savita: మంత్రి గారికి కోపం వచ్చింది.. బొకే విసిరికొట్టింది..!

Minister Savita

Minister Savita

Minister Savita: ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవితకు కోపం వచ్చింది.. ఎంతలా అంటే.. ఓ అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టేశారు మంత్రి.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగు చూడగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. మంత్రిగారికి ఎందుకంత కోపం..? ఏమిటా ప్రెస్టేషన్..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..

Read Also: Medak: ప్రాణం తీసిన జ్వరం, దగ్గు సిరప్.. ఐదేళ్ల చిన్నారి మృతి

తాజాగా, పెనుకొండ సీఎస్‌డీటీకి వెళ్లారు మంత్రి ఎస్‌. సవిత.. అయితే, అక్కడ ఓ అధికారి ఇచ్చిన బొకేను సీరియస్‌గా వెనక్కి విసిరేశారు.. ఆ బొకే కాస్తా.. గన్‌మన్‌ను తాకుతూ.. వెనక్కి పడిపోయింది.. అయితే, ఆలస్యంగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా.. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాపోయాయి.. ఈ నెల 1వ తేదీన అధికారులతో జరిగిన మీటింగ్ లో ఈ ఘటన జరిగినట్టుగా చెబుతున్నారు.. నిత్యవసరల సరుకుల పంపిణీ రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమంలో ఫ్లవర్ బొకేను విసిరేశారట మంత్రిగారు.. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో.. ఈ ఫ్లవర్ బొకే ఇష్యూ జరిగింది.. ఆలస్యంగా.. వెలుగుచూసినా.. ఆ దృశ్యాలు మాత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

Exit mobile version