AP Crime: వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని నుంచి అందినకాడికి అనే తరహాలో.. కోట్లాది రూపాయలు మోసాలు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న.. జిల్లాలో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు..
Read Also: Turaka Kishore: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్..
ఇక, దాల్ మిల్ సూరిపై కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌లో 20 కేసులు, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో 16 కేసులు నమోదయ్యాయని తెలిపారు ఎస్పీ రత్న.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు.. మరోవైపు, దాల్‌మిల్ సూరి ఆచూకీ తెలపాలంటూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో లుక్‌అవుట్ నోటీసులు జారీ చేస్తున్నాం అని వెల్లడించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న..
