Bhumika Reddy: మరణంలోనూ ఐదుగురికి ప్రాణం పోసిన యువ వైద్యురాలు.. శోకసంద్రమైన నంగివాండ్లపల్లి
- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదం..
- తీవ్రగాయాలతో బ్రెయిన్ డెడ్ అయిన యువ వైద్యురాలాలు..
- ఆమె అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు..
- మరణంలోనూ ఐదుగురి ప్రాణాలు కాపాడిన డాక్టర్ భూమికారెడ్డి..
- సత్యసాయి జిల్లా నంగివాండ్లపల్లిలో అంత్యక్రియలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumika Reddy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ భూమికారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు.. సత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి భూమికారెడ్డి భౌతికకాయాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.. తమ గ్రామానికి చెందిన యువ వైద్యురాలు ప్రాణాలు పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. డాక్టర్ భూమికారెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.. ఇక, తాను మరణించాక కూడా అవయవాదానంతో ఐదుగురి ప్రాణాలు కాపాడింది యువ డాక్టర్ భూమికారెడ్డి.. వైద్య వృత్తితో ఎంతోమందికి వైద్య సేవలు, చికిత్సలు అందించిన ఆమె.. ప్రాణాలు పోయిన తర్వాత కూడా అవయవ దానం చేసి ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు.. యువ డాక్టర్ భూమిక రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్యులు, స్నేహితులు.. నంగివాండ్లపల్లి గ్రాస్తులు బరువెక్కిన హృదయాలతో కన్నీటివీడ్కోలు పలికారు..
Read Also: Maha Kumbh Mela: వామ్మో.. ట్రాఫిక్ నరకం.. 300 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
కాగా, హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా వైద్య సేవలు అందించిన భూమికారెడ్డి.. ఈ నెల 1వ తేదీన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. హైదరాబాద్‌లో భూమికారెడ్డి ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా.. నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే, వారం రోజుల తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో, గతంలో భూమికారెడ్డి అవయవదానంపై చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. భూమిక అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. భూమికారెడ్డి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి అవసరమైన వారికి అవయమార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!