Chandrababu and Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహిస్తోంది.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కార్యక్రమం జరుగుతోంది.. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై చర్చతో పాటు.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్.. డ్రగ్ ఎడిక్షన్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఇక, గిన్నిస్ బుక్ రికార్డు దిశగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది.. 2 కోట్లకు పైగా భాగస్వామ్యంతో పేరెంట్ – టీచర్ మీటింగ్ జరుగుతుంగా.. 74 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని చెబుతున్నారు.. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఒక్క సారిగా ఉపాధ్యాయుడిగా మారిపోయి.. విద్యార్థులకు పాఠాలు భోదించారు.. ఇదే సమయంలో.. విద్యార్థిగా మారిపోయిన మంత్రి నారా లోకేష్.. విద్యార్థుల మధ్యే కూర్చొని ఆ క్లాస్ విన్నారు..
Read Also: Nakrekal: నా కోడికి న్యాయం కావాలి.. పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతి..!
పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు గ్రామంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. అయితే, ఉపాధ్యాయుడిగా మారారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పీటీఎం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు.. వనరుల అనే సబ్జెక్ట్ పై విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.. అయితే, విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు మంత్రి నారా లోకేష్.. ఆ తర్వాత విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి.. మార్కులపై ఆరా తీశారు సీఎం.. తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఫొటోలు దిగారు సీఎం చంద్రబాబు.. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.. ఈ మార్పులన్నింటినీ తీసుకొచ్చినందుకు మంత్రి లోకేష్‌పై ప్రసంశలు కురిపించారు సీఎం చంద్రబాబు నాయుడు..
