Minister Nara Lokesh: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు మంత్రి నారా లోకేష్.. నేను రెడీ అని ప్రకటించారు.. మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ సందర్భంగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ఆయన.. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు.. చదువు, మార్కులు, ఇతర అంశాలపై చర్చించారు.. ఇంతకీ పవన్ కల్యాణ్ విసిరిన ఆ సవాల్ ఏంటి? లోకేష్ ఎందుకు స్వీకరించారనే విషయాల్లోకి వెళ్తే..
Read Also: Compact vs Slim Phones: కాంపాక్ట్, స్లిమ్ ఫోన్లు.. ఏది బెస్ట్? ఎందుకు..?
ఆ మధ్య అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు.. మేం మొక్కలు నాటుతున్నాం.. మీరు మొక్కలు నాటేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోటి మొక్కలు నాటాలన్న సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను అని ఈ రోజు వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతామని ప్రకటించారు..
Read Also: Off The Record: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం గులాబీ పార్టీ స్కెచ్ మార్చిందా..?
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.. తల్లికి వందనం పథకం కింద నలుగురు విద్యార్థులకు సాయం అందగా.. విద్యార్థులు, వారి తల్లితో మంత్రి లోకేష్ మాట్లాడారు.. విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.. ఇక, గురు పౌర్ణమి రోజు… పుట్టపర్తి లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు లోకేష్.. ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్న ఆయన.. ప్రైవేట్ స్కూల్స్ లో బాయిలర్ కోళ్లలా కట్టేసి విద్యాబోధన జరుగుతుంది.. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆట, పాటలతో ఆరోగ్యకరమైన విద్యను అందిస్తున్నాం అన్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయాల్లో.. రాజకీయ పార్టీల రంగులు లేవన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి మొక్కలు నాటాలన్న సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను..ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతామని ప్రకటించారు..గతంలో ప్రభుత్వ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకుండా పోయింది.. ఇప్పుడు, సత్య సాయి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నాం.. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చాం.. మెగా డీఎస్సీ ప్రకటించాం… ఆగస్టు కల్లా టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం అని తెలిపారు.. డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాం అన్నారు మంత్రి నారా లోకేష్..
